News April 9, 2025
ఖమ్మంలో మిర్చిబోర్డు ఏర్పాటైతే క్వింటా రూ.25వేలు

మిర్చి సాగులో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో నిలువగా, రాష్ట్రంలో ఖమ్మం ప్రథమ స్థానంలో ఉంది. కానీ ఖమ్మం మిర్చి రైతుల చిరకాల వాంఛ మిర్చి బోర్డు ఏర్పాటుపై సంధిగ్ధo నెలకొంది. ప్రస్తుతం ధరలు క్వింటాకు రూ.13-15 వేల మధ్యే నడుస్తుండగా, బోర్డు ఏర్పాటైతే రూ.20-25 వేలు పలుకుతుందనే ఆశలు వారిలో రేకేత్తిస్తున్నాయ్. నిర్ణీత ధర లేక నష్టపోతున్న రైతన్నలు బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News January 8, 2026
రంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్-2 మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్

నకిలీ డాక్యుమెంట్లతో ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్న వ్యక్తులకు సహకరించిన రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2 కె.మధుసూధన్ రెడ్డిని రిజిస్ట్రేషన్లశాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు సస్పెండ్ చేశారు. అంతే కాదు.. మధుసూదన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
News January 8, 2026
టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరైన సీఎం రేవంత్

TG: హైదరాబాద్ గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి సీఎం రేవంత్, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు హాజరయ్యారు. ‘ఉపాధి’కి గాంధీ పేరు తొలగింపుపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై చర్చించనున్నారు. ఇతర అంశాలూ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
News January 8, 2026
విశాఖ: ‘తార’ల క్రికెట్ సందడి.. ఆ 3 రోజులు పండగే!

విశాఖ వేదికగా తారల క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. ACA-VDCA స్టేడియంలో జనవరి 16, 17, 18 తేదీల్లో CCL 2026 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా జనవరి 16న మధ్యాహ్నం 2 గంటలకు పంజాబ్ vs కర్ణాటక, సాయంత్రం 6:30కు మన తెలుగు వారియర్స్ vs భోజ్‌పురి దబాంగ్స్ తలపడతాయి. 17, 18 తేదీల్లో ముంబై, బెంగాల్, చెన్నై జట్లు ఆడే మ్యాచ్‌లతో ఈ వారాంతం విశాఖలో సందడి నెలకొననుంది.


