News January 20, 2025
ఖమ్మంలో యువకుడి మృతి..హత్యా? ఆత్మహత్యా..?

ఖమ్మంలోని పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన<<15158548>> సంజయ్ కుమార్<<>>(22) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సంజయ్ మృతిపై తల్లి మాట్లాడుతూ.. బాడీలో మోకాళ్లు దెబ్బతిన్నాయని, గొంతు లోపల రక్తం వచ్చిందని ఏం జరిగిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెట్టింగ్, ప్రేమ ఎలాంటి వ్యవహారాలు లేవని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.
Similar News
News February 11, 2025
కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 10, 2025
రఘునాథపాలెం: పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

ప్రజలకు ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను సందర్శించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
News February 10, 2025
ఖమ్మం: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, అనుమతి లేకుండా గైర్హాజరు అయిన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.