News June 20, 2024
ఖమ్మంలో రాజకీయ దుమారం రేపుతున్న జీవో 59
ఖమ్మంలో జీవో 59 వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికారంలో ఉన్న సమయంలో ఆక్రమించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు యత్నించినట్లు అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు.
Similar News
News September 8, 2024
ఏన్కూరు: పొంగి పొర్లుతున్న వాగులు.. రాకపోకలకు ఆటంకం
ఉమ్మడి ఖమ్మం జిల్లా శనివారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. తీగల బంజారా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పల్లిపాడు నుంచి కొత్తగూడెం వెళ్లాలనుకునే ప్రయాణికులు తల్లాడ వైపుగా వెళ్లాలని పోలీసు అధికారులు చెప్పారు. మరొకవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
News September 8, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
✓ఉమ్మడి ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన
✓ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
✓వరద ప్రభావిత ప్రాంతాల పర్యటించనున్న మంత్రి పొంగులేటి
✓వరదలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
✓సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News September 7, 2024
అధికారులను అలర్ట్ చేసిన జిల్లా కలెక్టర్
జిల్లా వ్యాప్తంగా ఉన్న 589 మంది పంచాయితీ కార్యదర్శులు ఆయా పంచాయతీల్లో అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆదేశించారు. గ్రామపంచాయతీ పరిధిలోని వాగులు కాలువలు కల్వర్టుల దగ్గర ప్రజలు దాటకుండా ఉండేందుకు రోడ్లు బ్లాక్ చేయాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. చేపల వేటకు వెళ్లకుండా ఆపాలన్నారు. ఎమ్మార్వోలు ఎంపీడీవోలు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.