News February 5, 2025
ఖమ్మంలో రూ.116 కోట్ల ధాన్యం కొనుగోళ్లు: కొత్వాల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో DCMS ద్వారా 2024-25 వానాకాలంలో 4.13 లక్షల క్వింటాళ్ల వరి ధాన్యానికి రూ.116.49 కోట్లు చెల్లించామని రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్, DCMS ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ధాన్యం కొనుగోలు వివరాలను ఆయన వెల్లడించారు. భద్రాద్రి జిల్లాలో 94 వేల క్వింటాళ్లకు గాను రూ.26.78 కోట్లు, ఖమ్మం జిల్లాలో 3.19 లక్షల క్వింటాళ్లకు గాను సుమారు రూ.90 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.
Similar News
News April 16, 2026
నల్గొండ: జనరల్ మహిళా స్థానాలపై ఎమ్మెల్యేల భార్యల కన్ను

నియోజకవర్గాల పునర్విభజనలో నకిరేకల్, తుంగతుర్తి స్థానాలు జనరల్‌గా మారే అవకాశం ఉందన్న ప్రచారంతో ఉమ్మడి నల్గొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో, మహిళా రిజర్వేషన్ల అంచనాలతో కీలక నేతల భార్యలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా వేముల వీరేశం భార్య పుష్పారెడ్డి, గాదరి కిశోర్ భార్య కమల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి పేర్లు తెరపైకి వస్తున్నాయి.
News April 16, 2026
RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News April 16, 2026
శ్రీకాకుళం: సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం

మే 21 నుంచి జూన్ 4 వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ రేగా సురేశ్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ నుంచి 27 మధ్య ఫీజు చెల్లించాలని విద్యార్థులు సూచించారు. రీ వెరిఫికేషన్ కు సైతం 20 వ తేదీ 27 మధ్య దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


