News August 3, 2024
ఖమ్మంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
విద్యుత్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మంకి చెందిన గోటం నాగలక్ష్మి ఓ కోచింగ్ సెంటర్లో ఆయాగా పనిచేస్తోంది. శుక్రవారం తన వద్ద తాళం చెవిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న వారికి ఇచ్చేందుకు తాళాలు విసరగా అవి విద్యుత్ తీగలపై పడ్డాయి. వాటిని ఆమె ఇనుప రాడ్ ద్వారా తీస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
Similar News
News September 17, 2024
కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం స్వామివారికి మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News September 17, 2024
కొత్తగూడెం: గోదావరి వద్ద గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వాహనంపై నుంచి విగ్రహం కిందకి దింపుతుండగా విగ్రహం జారీ కింద పడింది. ఈ ఘటనలో స్విమ్మర్ రాజేశ్‌కు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్సులో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News September 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశుని నిమజ్జనాలు
> నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
> నేడు సత్తుపల్లి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> నేడు కారేపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు