News May 28, 2024
ఖమ్మంలో 67.63%.. భద్రాద్రిలో 70.01%
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. 2021లో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 78.36 శాతం పోలింగ్ నమోదైతే నిన్న జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో 67.63 శాతం, భద్రాద్రి జిల్లాలో 70.01 శాతం పోలీంగ్ నమోదైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,23,985 మంది ఓటర్లు ఉండగా.. సాయంత్రం వరకు 51,053 మంది పురుషులు, 33,752 మహిళలు, 2 ఇతరులు ఓటేశారు.
Similar News
News November 17, 2024
ఈనెల 24న నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష: DEO
ఖమ్మం: 2024-25 విద్యా సం.కి గాను నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష ఈనెల 24న నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ వర్మ తెలిపారు. ఉ.9-30 నుంచి మ.12:30 వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. కావున విద్యార్థులు తమ పరీక్షా హాల్ టికెట్లను వెబ్సైట్ https://bse.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి పేర్కొన్నారు.
News November 16, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రీ, కొడుకు మృతి
చండ్రుగొండ మండలం తిప్పనపల్లి వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెం ఆంజనేయస్వామి ఆలయంలో పురోహితుడిగా విధులు నిర్వహిస్తున్న సతీష్ కుమార్ శర్మ అతని భార్య లక్ష్మీ హిమబిందు, కుమారుడితో కొత్తగూడెం నుంచి విఎం బంజర వైపు వెళుతున్నారు. మార్గమధ్యలో ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో సతీష్ కుమార్, అతని కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
News November 16, 2024
చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
చండ్రుగొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కొత్తగూడెం నుంచి బైక్‌పై వస్తున్న ఓ కుటుంబం తిప్పనపల్లి వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి ట్రాక్టర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.