News June 13, 2024
ఖమ్మం: అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కౌంటర్ ఒప్పందపై దరఖాస్తుల స్వీకరణ
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల అన్ని ప్రధాన బస్టాండ్లలో, పూర్తిగా తమ స్వంత వనరులతో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కౌంటర్ను 24/7 ఆపరేట్ చేయుటకు ఒప్పంద ప్రాతి పదికన, ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లుగా, ఉమ్మడి జిల్లా డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్), GN పవిత్ర, ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
Similar News
News January 20, 2025
ఇల్లందు: గుండెపోటుతో స్కూల్లోనే టీచర్ మృతి
ఇల్లందులోని జేబీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్ గుండెపోటుతో మృతి చెందాడు. సోమవారం పాఠశాలలో విధులకు హాజరైన ఆయన ఛాతీలో విపరీతమైన నొప్పి రావడంతో కుప్పకూలాడని సిబ్బంది తెలిపారు. అంబులెన్సులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. రమేశ్ మృతి పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
News January 20, 2025
కూసుమంచి గణపేశ్వరాలయం చరిత్ర ఇదే..!
కూసుమంచి గణపేశ్వరాలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 11-12వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటి. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ప్రతి శివరాత్రికి ఖమ్మంతో పాటు నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
News January 20, 2025
ఖమ్మంలో యువకుడి మృతి..హత్యా? ఆత్మహత్యా..?
ఖమ్మంలోని పోలెపల్లి రాజీవ్ గృహ కాలనీకి చెందిన<<15158548>> సంజయ్ కుమార్<<>>(22) అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. సంజయ్ మృతిపై తల్లి మాట్లాడుతూ.. బాడీలో మోకాళ్లు దెబ్బతిన్నాయని, గొంతు లోపల రక్తం వచ్చిందని ఏం జరిగిందో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బెట్టింగ్, ప్రేమ ఎలాంటి వ్యవహారాలు లేవని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.