News March 21, 2024
ఖమ్మం: అధికారులు లంచం అడుగుతున్నారా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ అధికారులు(అన్ని శాఖలు) ఎవరైనా పనులు చేసేందుకు ప్రజల నుంచి లంచాలు అడిగితే అవినీతి నిరోధక శాఖ నెంబర్లకు ఫోన్ చేయాలనీ ఆ శాఖ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్-9154388981, ఇన్స్పెక్టర్ నంబర్స్-9154388984, 9154388986, 9154388987, టోల్ ఫ్రీ నెంబర్-1064 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా, ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
Similar News
News April 24, 2025
ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారరు. అనంతరం జూలూరుపాడులో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
News April 24, 2025
ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.
News April 24, 2025
ఖమ్మం: పంట బీమా పథకంపై మంత్రి తుమ్మల సమావేశం

పంట బీమా పథకం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం, యాసంగి కాలాల్లో ఏయే పంటలకు ఏయే విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంట బీమా పథకంలో భాగంగా రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.