News April 28, 2024
ఖమ్మం: అన్నదాతల్లో చిగురిస్తున్న ఆశలు
రూ.2 లక్షల చొప్పున రైతుల రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించినా ఇప్పట్లో రైతు రుణమాఫీ కాదని చాలామంది భావించారు. కానీ సీఎం స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాల రైతులు మాఫీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.
Similar News
News November 12, 2024
ఖమ్మం: సొంత నివాసాలు లేని మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వంలో ఖమ్మం జిల్లా నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు పొంగులేటి, తుమ్మల, భట్టి కీలక బాధ్యతల్లో ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులకు జిల్లాలో తమ తమ నియోజకవర్గాలలో సొంత నివాసాలు లేవు. భట్టి మధిర ఎమ్మెల్యేగా ఉండగా వైరాలో ఆయనకు నివాసం ఉంది. పాలేరుకు పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆయనకు ఖమ్మంలో నివాసం ఉంది. ఇక ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మలకు పాలేరులో నివాసం ఉంది.
News November 12, 2024
ఖమ్మం మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. రామసహాయం రాధికను ఒహాయో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ నియమించారు. కైకొండాయిగూడెంకు చెందిన రామసహాయం నిర్మల, బుచ్చిరెడ్డి కూతురు రాధిక. వివాహం అనంతరం ఉద్యోగరీత్యా వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె చేసిన సేవాలకు గుర్తింపుగా ఈ గౌరవం దక్కినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
News November 12, 2024
4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నాం: మంత్రి
4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం చిన్న వెంకటగిరిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొంగులేటి పలువురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.