News May 20, 2024
ఖమ్మం: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.
Similar News
News February 28, 2026
ఏన్కూర్‌లో ఎంపీపీఎస్ హెచ్‌ఎమ్ సస్పెండ్

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.
News February 28, 2026
దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై విచారణ

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.
News February 27, 2026
ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్’

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్ చాట్ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


