News May 25, 2024

ఖమ్మం: అమ్మమ్మ ఇంటికి వచ్చి అనంతలోకాలకు!

image

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కలంచెరువుకు చెందిన రితీష్(6) వేసవి సెలవుల్లో అమ్మమ్మ ఊరైన ఖమ్మం రూరల్ ముత్తగూడెం వచ్చాడు. వీరి ఇంట్లో త్వరలోనే ఫంక్షన్ ఉండగా మేనమామలు కరుణాకర్, వెంకన్నలతో కలిసి పాలేరు సంత నుంచి గొర్రెలు బైక్‌పై తెస్తుండగా.. తిరుమలాయపాలెం KGBV వద్ద ఆగి ఉన్న కారును వీరి బైక్ ఢీకొట్టింది. పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చున్న రితీష్ తలకు తీవ్రగాయమైంది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

Similar News

News October 28, 2025

డిప్లొమా దరఖాస్తు గడువు పొడిగింపు: ప్రిన్సిపల్ శంకర్

image

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నిషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల దరఖాస్తు గడువును నవంబర్ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. రెండేళ్ల కాల వ్యవధి గల ఈ కోర్సుల్లో 60 సీట్లు ఉన్నాయన్నారు. బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, అభ్యర్థులు పూర్తి వివరాలకు https://tspmb.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News October 28, 2025

ఖమ్మం: రూ.2.6 లక్షలతో జర్మనీలో ఉద్యోగాలు

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ITI క్యాంపస్‌లోని మోడల్ కెరీర్ సెంటర్‌లో ఈనెల 30న జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం ఎన్రోల్మెంట్ డ్రైవ్ జరగనుందని జిల్లా ఉపాధికల్పన అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ITI ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న, 19-30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్లతో హాజరు కావాలని, ఎంపికైన వారికి నెలకు రూ.2.6 లక్షల వేతనం ఉంటుందన్నారు.

News October 28, 2025

పాలేరు జలాశయంలో భారీ చేప

image

కూసుమంచి మండలం నాయకన్ గూడెంకు చెందిన జాలరి మేకల పరశురాములుకు పాలేరు జలాశయంలో భారీ చేప లభించింది. వేటకు వెళ్లగా ఆయన వలలో 19 కేజీల మీసాలజెల్ల చేప చిక్కింది. దీని ధర కేజీ రూ.200 ఉంటుందని పరశురాములు వెల్లడించాడు. ఇలా మీసాలతో ఉండే చేపలు జలాశయంలో అరుదుగా లభ్యమవుతాయన్నాడు.