News January 30, 2025
ఖమ్మం: ఆందోళన కలిగిస్తున్న క్షయ కేసులు

ఖమ్మం జిల్లాలో క్షయ వ్యాధి తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వ్యాప్తంగా గతేడాది 2,314 మందికి వ్యాధి సోకినట్లు వైద్యశాఖ గుర్తించింది. గత నవంబర్ వరకు 25,847 మందికి పరీక్షలు చేయగా ఈ మేరకు కేసులు వెలుగుచూశాయి. ఎక్కువగా ఖమ్మం, సత్తుపల్లి, మధిర, వైరాలో కేసులు నమోదయ్యాయి. ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా ఆశించిన స్థాయిలో కేసులు తగ్గుముఖం పట్టడం లేదని జిల్లా టీబీ కంట్రోల్ అధికారులు అంటున్నారు.
Similar News
News February 10, 2025
పులిగుండాల అందాలు చూడతరమా..!

ఖమ్మం జిల్లా కనకగిరి రిజర్వ్ ఫారెస్ట్‌లో పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన అటవీ ప్రాంతమైన పులిగుండాలను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ట్రెక్కింగ్, చెరువులో బోటింగ్, రాత్రిళ్లు నక్షత్రాల వ్యూ, క్యాంపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పర్యాటక పనులు త్వరగా పూర్తి చేస్తే జిల్లా పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా వాసులు అభిప్రాయ పడుతున్నారు.
News February 9, 2025
భద్రాద్రి: తల్లి మందలించిందని కుమారుడి ఆత్మహత్య

తల్లి బైక్ కొనివ్వలేదని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అశ్వారావుపేటలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు వివరాలిలా.. అశ్వారావుపేట ఫైర్ కాలనీకి చెందిన చీకటి స్వామి(20) గత కొన్ని రోజులుగా బులెట్ బైక్ కొనివ్వాలని తల్లిని అడుగుతున్నాడు. ఈరోజు ఖర్చులకు డబ్బులు అడిగాడు. తల్లి ఇవ్వకపోవడంతో మనస్తాపం చెంది, క్షణికావేశంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
News February 9, 2025
చిరుమల్ల వనదేవతల జాతరకు వేళాయే!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం చిరుమల్ల గ్రామంలో సమ్మక్క సారక్క జాతరకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. జాతర తేదీలను ప్రకటించింది. జాతర వివరాలిలా.. ఈనెల 11వ తేదీన జాతర ప్రారంభం కానుంది. 12న ఎదురుగుట్ట నుంచి పగిడిద్ద రాజును, 13న ముసలమ్మ గుట్ట నుంచి సమ్మక్క తల్లిని తీసుకొచ్చి కళ్యాణం జరుపుతారు. 14న శంకుపండుగ, 15న చిరుమల్ల నుంచి ముసలమ్మ గుట్టకు సమ్మక్కను తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది.