News January 4, 2025
ఖమ్మం: ఆన్ లైన్ గేమ్స్‌తో ప్రాణాలు పోతున్నాయ్!

ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఈజీగా డబ్బు సంపాదించవచ్చనే ఆలోచనతో యువత ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారు. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, నిరుద్యోగులు ఉంటున్నారు. కూసుమంచి మం. గైగోళ్ళపల్లికి చెందిన ఉపేందర్ ఆన్లైన్ గేమ్స్‌లో రూ.5 లక్షల వరకు పోగొట్టుకుని <<15051449>>బలవన్మరణానికి <<>>పాల్పడ్డాడు. ఆన్లైన్ గేమ్స్ ప్రమాదకరమని దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News December 5, 2025
‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.
News December 5, 2025
ఖమ్మం మార్కెట్‌కు రేపు, ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News December 5, 2025
స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలెక్కడ?: ఎంపీ

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి కార్యాచరణను ఆచరిస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశీయ తయారీదారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాల గురించి, రక్షణ సముపార్జన ప్రక్రియకు కేంద్రం ఏమైనా సవరణలు చేసిందా? అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ స్పందిస్తూ.. స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.


