News January 1, 2025

ఖమ్మం: ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.20,506

image

ఆయిల్‌పామ్‌ సాగు రైతులకు అదృష్టయోగం పట్టింది. ఆయిల్‌పామ్ గెలల ధర మూడు నెలలకు భారీగా పెరిగింది. టన్ను గెలల ధర అక్టోబర్‌లో రూ.19,140 వరకు ఉంది. ఇది నవంబర్, డిసెంబర్ నెలలకు రూ.20,413 వరకు పెరిగింది. ఈ నెలలో(జనవరి) పామాయిల్ టన్ను ధర రూ.20,506గా నిర్ణయిస్తూ తెలంగాణ ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రకటించారు. గత మూడు నెలలుగా ఆయిల్‌పామ్ ధర పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు.

Similar News

News January 23, 2025

అర్హులందరికీ సంక్షేమ పథకాలు: పొంగులేటి

image

ప్రాథమిక లిస్టులో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేశవపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఓ పక్క అభివృద్ధితోపాటు మరోపక్క ప్రజలకు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు. 

News January 23, 2025

ఖమ్మం: తగ్గిన పత్తి, మిర్చి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.14,250 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ.15,000గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.250, కొత్త మిర్చి రూ.100, పత్తి రూ.100 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.

News January 23, 2025

ఖమ్మం: రెండో రోజు 52,829 దరఖాస్తుల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో రెండో రోజు బుధవారం 204 గ్రామసభలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల పేర్లు ప్రకటించడంతో పాటు ఎంపికకాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. మొత్తం 52,829 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. వాటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 18,777, రేషన్ కార్డులకు 17,962, రైతుభరోసా 2,147, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 13,943 దరఖాస్తులు అందాయన్నారు.