News February 18, 2025

ఖమ్మం: ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం

image

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్‌ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.

Similar News

News March 23, 2025

ఖమ్మం: రెండో రోజు 34 మంది విద్యార్థుల గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో రెండో రోజు శనివారం పదో తరగతి హిందీ పరీక్షకు 34మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖర శర్మ తెలిపారు. మొత్తం 16,386 మంది విద్యార్థులకు గాను 16,352మంది పరీక్షలకు హాజరయ్యారని చెప్పారు. ఎనిమిది పరీక్ష కేంద్రాలను డీఈవో, 37 పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేసినట్లు డీఈవో పేర్కొన్నారు.

News March 23, 2025

ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

image

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ. 185 ఉండగా, స్కిన్ లెస్ కేజీ రూ.210 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ. 130 మధ్య ఉంది. కాగా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలు పెరగాయని, ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు.

News March 23, 2025

ఖమ్మం: బావిలో పడి మహిళా కూలీ మృతి

image

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నాగులవంచ గ్రామానికి చెందిన కూరపాటి రాంబాయి (54) అనే మహిళ శనివారం ఉదయం కూలీ పనికి వెళ్లగా తాగునీరు కోసం బావి దగ్గరికి వెళ్లి మంచినీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల మీరా కేసు నమోదు చేశారు.

error: Content is protected !!