News May 23, 2024
ఖమ్మం: ఆస్తి కోసం తండ్రిని చంపిన కూతురు..!

ఆస్తి కోసం కన్న కూతురే తండ్రిని చంపిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో చోటుచేసుకుంది. గోరిలపాడుతండాకు చెందిన తేజవత్ బిచ్చు(60)కు కూతురు సక్కుకు ఆస్తి పంపకాల నేపథ్యంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో సక్కు, మనుమరాలు నగ్మ కలిసి అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News July 10, 2025
ఖమ్మం: సీఎంఆర్ రిక‘వర్రీ’

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్‌లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్‌పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.
News July 10, 2025
ఖమ్మంలో ఈ నెల 11న జాబ్ మేళా..!

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. రిలయన్స్ నిప్పన్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 25 పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంపికైన వారికి రూ.20 వేలు నుంచి రూ.50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు 11 గంటలకు జరిగే మేళాలో పాల్గొనాలని సూచించారు.
News July 10, 2025
రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: ఖమ్మం DAO

జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతుల అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి D.పుల్లయ్య తెలిపారు. బుధవారం సత్తుపల్లి రామానగరంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల డీలర్లు MRPకి మించి అధిక ధరలకు విక్రయించొద్దని హెచ్చరించారు. ఒక ఎరువు కొంటే మరొకటి కొనమని రైతులను ఒత్తిడి చేయవద్దని సూచించారు.