News March 4, 2025
ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 72 కేంద్రాలు ఏర్పాటు

ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 36,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా 72 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, హాల్ టికెట్ నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించగా, దానిపై సెంటర్ చిరునామా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు.
Similar News
News March 24, 2025
విద్యార్థిని తండ్రి నిర్ణయం.. అధికారులను కదిలించింది..

ఓ విద్యార్థిని తండ్రి పట్టుదల కారణంగా ఓ స్కూల్ మూతపడకుండా నడుస్తోంది. వైరా మం. నారపునేనిపల్లి స్కూల్‌లో కోతుల బెడద, ఇతర కారణాలతో విద్యార్థులు వెళ్లిపోయారు. దీంతో స్కూల్ మొత్తంలో నాలుగో తరగతి విద్యార్థి కీర్తన మాత్రమే మిగిలింది. అధికారులు స్కూల్‌ను మూసివేసేందుకు యత్నించగా.. తన కుమార్తె చదువు మాన్పిస్తానని కీర్తన తండ్రి అనిల్‌శర్మ చెప్పారు. ఇందుకు అధికారులే బాధ్యత వహించాలనడంతో వెనక్కి తగ్గారు.
News March 24, 2025
KTDM: ఆ ప్రాంతంలో MLA ఉప ఎన్నికలు అనివార్యమేనా..?

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. రేపు ఈ కేసును ధర్మాసనం విచారించనుంది. ఈ క్రమంలో భద్రాచలం BRS నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు పడుతుందా.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. భద్రాచలంలో ఉప ఎన్నికలు జరుగుతాయా అని స్థానికంగా జోరుగా చర్చ నడుస్తోంది. దీనిపై మీ కామెంట్?
News March 24, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాల అంతరాయం ∆} పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం