News April 9, 2024

ఖమ్మం: ఇరువర్గాల మధ్య ఘర్షణ.. 9 మందికి గాయాలు

image

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 9 మందికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 18, 2025

రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసిన ఎంపీ రవిచంద్ర

image

ఇటీవలే అనారోగ్యానికి గురై విశ్రాంతి తర్వాత కోలుకుని పార్లమెంట్‌కు హాజరైన ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్‌ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహచర ఎంపీలతో కలిసి పరామర్శించారు. పార్లమెంట్ ఆవరణలోని రాజ్యసభ చైర్మన్ ఛాంబర్లో కలిసి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. ప్రజలు, దేవుని ఆశీస్సులతో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవడం పట్ల రవిచంద్ర ఆనంద వ్యక్తం చేశారు.

News March 18, 2025

ఖమ్మం: శరవేగంగా ‘అమృత్’ నిర్మాణ పనులు

image

రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతోఅమృత్ 2.0 నిధుల నుంచి మంజూరైనరూ.249 కోట్ల వ్యయంతో ఖమ్మం నగరంలో చేపట్టిన అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులను సోమవారం మేయర్ పునుకొల్లు నీరజ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖానాపురం ఊర చెరువు నుండి రామకృష్ణాపురం మున్నేరు వరకు చేరిన మురుగు నీరును అక్కడ ఎస్టిపిలో శుద్ధిచేసి మున్నేరులో వదలడం జరుగుతుందని ఈఈ రంజిత్ కుమార్ తెలిపారు.

News March 17, 2025

నాలుగో తరగతి బాలికపై లైంగిక దాడి

image

పాల్వంచలో దారుణం జరిగింది. పొలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన శివకుమార్ నాలుగో తరగతి చదివే ఓ బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మబలికాడు. డాబా పైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక కుటుంబ సభ్యులకు తెలిపింది. కాగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

error: Content is protected !!