News June 11, 2024

ఖమ్మం: ఉరివేసుకొని యువతి ఆత్మహత్య

image

ఉరివేసుకొని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఎర్రుపాలెం మండలంలో చోటుచేసుకుంది. ములుగుమాడు గ్రామానికి చెందిన ఓ యువతీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఉరివేసుకుని ఉన్న యువతిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా యువతి ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 28, 2026

ఏన్కూర్‌లో ఎంపీపీఎస్ హెచ్‌ఎమ్ సస్పెండ్

image

ఏన్కూర్ ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయురాలు బుగ్గినేని జయను సస్పెండ్ చేశారు. ఈసీఆర్ కార్యక్రమం అమలులో లోపాలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి బోధన విధానం, విద్యార్థుల అభ్యాస స్థాయిని పరిశీలించారు. సస్పెన్షన్ ఉత్తర్వులను మండల విద్యాధికారి నాగిరెడ్డి అందజేశారు.

News February 28, 2026

దెందుకూరు జెడ్పీహెచ్‌ఎస్‌ ఉపాధ్యాయుడిపై విచారణ

image

మధిర మండలం ZPHS దెందుకూరులో తెలుగు ఉపాధ్యాయుడు స్వర్గం శ్రీనివాసరావుపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యార్థినుల పట్ల ఆయన అనుచితంగా ప్రవర్థించాడని వారి తల్లిదండ్రులు ఆరోపించారు. మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్‌ను ఎంక్వయిరీ అధికారిగా నియమించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడిని కూడా విచారణ బృందంలో చేర్చారు.

News February 27, 2026

ఖమ్మం: విద్యుత్తు సమస్యల పరిష్కారానికి ‘వాట్సాప్‌’

image

విద్యుత్తు వినియోగదారుల సమస్యల త్వరితగతిన పరిష్కారానికి 7901628348 నంబరుతో వాట్సాప్‌ చాట్‌ బాట్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి తెలిపారు. వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈ నంబరుకు ‘Hi’ అని పంపి ఫిర్యాదు చేయవచ్చన్నారు. కంప్లైంట్‌ ఐడీ ద్వారా సమస్య పరిష్కారాన్ని ట్రాక్ చేయవచ్చని, పారదర్శక సేవలే సంస్థ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.