News February 27, 2025
ఖమ్మం: ఊటీని తలదన్నేలా.. వెలుగుమట్ల అర్బన్ పార్కు

కనుచూపు మేరంతా పచ్చదనం, ఆకాశ హర్య్మాలతో కనువిందు చేస్తుంది వెలుగుమట్ల అర్బన్ పార్కు. ప్రకృతి అందాలు ఓ వైపు.. పర్యాటక శోభ మరో వైపుతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ పార్కు అందాలను ఖమ్మం వాసులే కాకుండా చుట్టు పక్కల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. 440 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కులో 30 ఎకరాల్లో పర్యాటకాన్ని వృద్ధి చేస్తున్నారు.. ఆధునిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
Similar News
News February 23, 2026
KNR: అంగన్‌వాడీ కేంద్రాల్లో సర్పంచ్‌ల పెత్తనం..!

గ్రామస్థాయిలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను స్థానిక సర్పంచ్‌లకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ 777, పెద్దపల్లి 706, జగిత్యాల 1065, సిరిసిల్ల 587 కేంద్రాల్లో పోషకాహార పంపిణీ, నాణ్యతను పరిశీలించేందుకు సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీలు కొలువుదీరనున్నాయి.
News February 23, 2026
విద్యార్థుల కోసం ఇస్రో ‘YUVIKA’

అంతరిక్షంపై ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఇస్రో YUVIKA ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్‌లో బేసిక్ నాలెడ్జ్‌ను పరిచయం చేయడం దీని ఉద్దేశం. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్నవారు అర్హులు. FEB 27-మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ క్విజ్ ద్వారా ఎంపిక చేస్తారు. మే 11 నుంచి 22 వరకు ఉచితంగా శిక్షణ ఇస్తారు.
వెబ్‌సైట్: https://www.isro.gov.in/
News February 23, 2026
NLG: ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు వెనకడుగు..!

నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిబంధనలు శాపంగా మారాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, ప్రభుత్వం విధించిన కఠిన నిబంధనలతో 3,300 ఇళ్ల మంజూరును ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం రూ.5 లక్షల సాయం సరిపోక, బేస్‌మెంట్ ఖర్చులకే లక్షలు అవుతుండటంతో పేదలు వెనకడుగు వేస్తున్నారు. దీంతో కొత్త లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నిర్మాణ వ్యయం పెంచాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.


