News March 29, 2024
ఖమ్మం: ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

ఖమ్మం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌తో కలిసి రూరల్ మండలం పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఖమ్మం లోకసభ ఎన్నికల కౌంటింగ్ పనుల పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏడు సెగ్మెంట్లకు కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూంలు, కేంద్రీకృత రిసెప్సన్ కేంద్రం ఏర్పాటుపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు.
Similar News
News December 6, 2025
రెండో విడత ఎన్నికలు.. నేడు గుర్తులు కేటాయింపు.!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులకు ఆయా కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు ఈరోజు గుర్తులు కేటాయించనున్నారు. అటు మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఇప్పటికే రెబల్స్ బరిలో నిలిచిన అభ్యర్థులను ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లను విత్ డ్రా చేయించే పనిలో నిమగమయ్యారు. కాగా గుర్తుల కేటాయింపు అనంతరం ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది.
News December 6, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} నేడు ఖమ్మం, మధిర, చింతకాని మండలాల్లో పవర్ కట్
∆} నేడు ఎన్నికల రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ
∆} నేడు ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
News December 6, 2025
సేంద్రియ సాగు శిక్షణకు వంద మంది రైతులు: మంత్రి తుమ్మల

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సేంద్రియ సాగు ప్రోత్సాహంపై ఏపీలోని పినగూడూరు లంకలో జరగనున్న శిక్షణ శిబిరానికి ఖమ్మం జిల్లా నుంచి 100 మంది రైతులను పంపాలని మంత్రి ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతినిధులు కోరారు.


