News March 19, 2025
ఖమ్మం: ఓటు నమోదుకు 4,734 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో ఫారం 6 క్రింద 4,734 దరఖాస్తులు రాగా, 3,267 నూతన ఓటర్లను నమోదు చేశామని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇందులో 943 దరఖాస్తులు తిరస్కరించామని, 550 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే జిల్లాలో 1,459 పోలింగ్ కేంద్రాలకు గాను ఈవీఎం గోడౌన్లో 5,824 బ్యాలెట్ యూనిట్లు, 2,202 కంట్రోల్ యూనిట్లు, 2,218 వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
Similar News
News March 19, 2025
రూ.3,04,965 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన Dy.CM

తెలంగాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లబడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12571 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేలకోట్లు, విద్యాశాఖ రూ.23108 కోట్లు కళ్యాణ లక్ష్మీ రూ.3683, వైద్యారోగ్యశాఖకు రూ.23108 కోట్లు, గృహజ్యోతి రూ.2080 కోట్లు, రైతు బీమా రూ.1539 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.
News March 19, 2025
బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.
News March 19, 2025
మత్కేపల్లిలో రూ.1.50లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిఫారసు మేరకు మత్కేపల్లి గ్రామానికి చెందిన బండి స్వాతి రూ.60,000, పగడాల శీను రూ.40,000, పగడాల బాబురావు రూ. 50,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో చింతకాని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.