News April 28, 2024

ఖమ్మం: కమ్యూనిస్టులతో కాంగ్రెస్ అభ్యర్థి భేటీ

image

కమ్యూనిస్టులతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురామ్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర్లు, కల్యాణం వెంకటేశ్వ రావులతో కలిసి సమావేశమయ్యారు. ఖమ్మం ఎంపీ స్థానం ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించారు. 

Similar News

News November 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్త సమాచారం

image

☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో నేడు ప్రజావాణి కార్యక్రమం ☆ ఖమ్మంలో నేడు మంత్రి తుమ్మల పర్యటన ☆ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నేడు పునః ప్రారంభం ☆ తిరుమలాయపాలెం కాంగ్రెస్ నేతలతో నేడు మంత్రి పొంగులేటి సమావేశం ☆ కారేపల్లిలో నేడు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ☆ భద్రాచలం ఐటిడిఏలో నేడు గిరిజన దర్బార్ కార్యక్రమం ☆ ఉమ్మడి జిల్లాలో నేడు కార్తీక మాసం మొదటి సోమవారం వేడుకలు

News November 4, 2024

నేడు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునః ప్రారంభం

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం నుంచి క్రయవిక్రయాలు పునః ప్రారంభం కానున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. వరుసగా నాలుగు రోజుల సెలవులు అనంతరం సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

News November 3, 2024

భద్రాద్రి రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.