News February 14, 2025
ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ హెచ్చరిక..!

మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఖమ్మం కలెక్టర్ ముజామిల్ ఖాన్ వార్నింగ్ ఇచ్చారు. కేఎంసీ కార్యకలాపాలపై స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. పారదర్శకంగా పాలన అందించాలని, ఇష్టారీతిన వ్యవహరిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. తనకు పని కంటే ఎవరూ ముఖ్యం కాదని, రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News March 14, 2025
సాగు, తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో సాగు, తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. గురువారం పాలేరు జలాశయాన్ని సందర్శించి, జలాశయం నీటిమట్టం వివరాలను నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంటల పరిస్థితిపై వ్యవసాయ శాఖ అధికారులను ఆరా తీశారు.
News March 13, 2025
ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. 584 గైర్హాజరు

ఖమ్మం జిల్లాలో గురువారం ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 15,880 మందికి గాను 15,489 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,379 మంది విద్యార్థులకు గాను 2,186 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 584 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.
News March 13, 2025
ఖమ్మం: విషాదం.. BRS నాయకుడి కుమార్తె మృతి

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం యడవల్లిలో కొంతకాలంగా లివర్ వ్యాధితో బాధపడుతున్న BRS నాయకుడు చేరుకుపల్లి భిక్షం రెండో కుమార్తె చేరుకుపల్లి శిరీష(23) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి ఈరోజు మృతిచెందిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె మృతితో తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రులయ్యారు. గ్రామస్థులు ఆమె అకాల మరణంపై విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.