News April 25, 2024
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రొఫైల్

ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిగా రామసహాయం రఘురామ్ రెడ్డిని అధిష్ఠానం ప్రకటించింది. వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి కొడుకే రఘురామ్ రెడ్డి. మంత్రి పొంగులేటి, సినీ హీరో వెంకటేశ్‌కు ఆయన వియ్యంకుడు. గతేడాది పొంగులేటి కుమార్తెను రఘురాంరెడ్డి చిన్న కుమారుడికిచ్చి పెళ్లి చేయగా, పెద్ద కొడుక్కి నటుడు వెంకటేశ్ కుమార్తెతో వివాహమైంది. రఘురామ్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.
Similar News
News January 14, 2026
UPDATE: ఖమ్మం LIG ఫ్లాట్ల రహదారి సమస్య పరిష్కారం

ఖమ్మం శ్రీరాం నగర్‌లో హౌసింగ్ బోర్డు నిర్మించిన LIG ఫ్లాట్లలో రహదారి సమస్య ఎట్టకేలకు పరిష్కారమైనట్లు హౌసింగ్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రమణా రెడ్డి వెల్లడించారు. కాగా రహదారి విషయంలో ఏర్పడిన సమస్య కారణంగా, అనేక మంది దరఖాస్తు చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు. సమస్య పరిష్కారం కావడంతో LIG ఫ్లాట్స్‌కు JAN 18 వరకు ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, 19న లాటరీ ద్వారా ప్లాట్స్ కేటాయిస్తామని పేర్కొన్నారు.
News January 14, 2026
మధిర, వైరా నియోజకవర్గాలకు రూ.140 కోట్లు మంజూరు

మధిర మున్సిపాలిటీ పరిధిలో డ్రైయిన్స్, వైరా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.140 కోట్ల ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. రూ.40 కోట్లతో మధిర మున్సిపాలిటీలో డ్రైయిన్ నిర్మాణం, రూ.65 కోట్లతో వైరా నది వెంట వరద నివారణ కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణం, ప్రస్తుతం ఉన్న మురుగునీటి కాలువల ఆధునీకరణ పనులకు రూ.35 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
News January 14, 2026
ఖమ్మం జిల్లాలో 1,43,320 మంది ఓటర్లు

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అధికారులు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. మొత్తం 1,43,320 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో అత్యధికంగా ఏదులాపురంలో 45,256 మంది ఓటర్లు ఉండగా.. తక్కువగా కల్లూరులో 18,866 మంది ఉన్నారు. సత్తుపల్లి 28,830, మధిర 25,679, వైరా 24,689 ఓటర్లతో మున్సిపల్ బరి సిద్ధమైంది. ఓటర్ల జాబితా ఖరారు కావడంతో రాజకీయ సందడి మొదలైంది.


