News April 29, 2024
ఖమ్మం: కాంగ్రెస్ నేత నామినేషన్ ఉపసంహరణ

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆ పార్టీ నేత పోట్ల నాగేశ్వరరావు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ నుంచి రామ సహాయం రఘురామ్ రెడ్డి పోటీలో ఉండడంతో నామినేషన్ విత్ డ్రా చేసుకున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ముందుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 18, 2025
ఖమ్మం: ‘పదవి ముగిసిన.. బాధ్యతలకు ముగింపు లేదు’

సర్పంచ్ పదవి కాలం ముగిసి 20 నెలలు కావొస్తున్న.. రఘునాథపాలెం మండలంలోని బూడిదంపాడు గ్రామ మాజీ సర్పంచ్ షేక్ మీరా సాహెబ్ మాత్రం తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉన్నారు. అనునిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ అనేక పనులు చేయిస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. వీధులను శుభ్రం చేయించడం, బ్లీచింగ్ చల్లించడం, పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కల నివారణకు కలుపు మందు పిచికారి చేయించడం వంటి ఎన్నో పనులు చేపిస్తూ ఉన్నారు.
News September 18, 2025
ఖమ్మం పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ₹18 కోట్లు

ఖమ్మంలోని వెలుగుమట్ల అర్బన్ పార్కు, ఖిల్లా రోప్‌వే అభివృద్ధికి ప్రభుత్వం ₹18 కోట్లు మంజూరు చేసింది. పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి ఈ మేరకు జీఓ నెం.51ని విడుదల చేశారు. వెలుగుమట్ల పార్కు అభివృద్ధి, నిర్వహణకు ₹3 కోట్లు, ఖిల్లా రోప్‌వే, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం ₹15 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలో పర్యాటకం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
News September 18, 2025
ఖమ్మం: వైద్య ఆరోగ్యంపై Dy.CM సమీక్ష

ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో Dy.CM మల్లు భట్టి విక్రమార్క వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ, 627 ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలకు అంకితభావంతో సేవలందించాలని ఆయన ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి, జిల్లా స్థాయిలో కోఆర్డినేటర్ల ద్వారా మానిటరింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలు కల్పించి, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్ట నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.