News May 4, 2024

ఖమ్మం: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

image

NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News November 27, 2025

ఖమ్మం: 50 వేల మంది మహిళలకు ‘ఉల్లాస్‌’ వెలుగులు

image

15 ఏళ్లు నిండిన నిరక్షరాస్యులైన మహిళలకు సంపూర్ణ అక్షరాస్యత కల్పించేందుకు కేంద్రం ‘ఉల్లాస్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలోని డ్వాక్రా మహిళల్లో 50 వేల మందికి పైగా అక్షరాస్యులు కానీ వారిని గుర్తించారు. వీరికి చదవడం, రాయడంతో పాటు జీవన నైపుణ్యాలు నేర్పడానికి ప్రతి 10 మందికి ఒక వలంటీర్‌ను నియమించి, అంగన్వాడీ కేంద్రాలు, పంచాయతీల్లో శిక్షణ ఇస్తున్నారు.

News November 27, 2025

ఖమ్మం: నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. మొదటి దశలో ఏడు మండలాల్లోని 192 గ్రామ పంచాయతీలకు నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కొణిజర్ల, వైరా, మధిర, రఘునాథపాలెం, బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News November 27, 2025

రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ.. ఖమ్మంలో కూల్చివేతలు

image

ఖమ్మం నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్‌ కాంప్లెక్స్‌లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు.