News May 4, 2024
ఖమ్మం: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫిక్స్.. BJP నుంచి అతనేనా..?

NLG -WGL-KMM పట్టభద్రుల MLC నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేయగా.. BRS తమ అభ్యర్థిగా వరంగల్‌కు చెందిన రాకేష్ రెడ్డిని ప్రకటించింది. BJP నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డి, గతంలో ఈ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. మూడు పార్టీలు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News December 6, 2025
సేంద్రియ సాగు శిక్షణకు వంద మంది రైతులు: మంత్రి తుమ్మల

ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా అగ్రి-హార్టికల్చర్ సొసైటీ ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. సేంద్రియ సాగు ప్రోత్సాహంపై ఏపీలోని పినగూడూరు లంకలో జరగనున్న శిక్షణ శిబిరానికి ఖమ్మం జిల్లా నుంచి 100 మంది రైతులను పంపాలని మంత్రి ఉద్యానవన శాఖకు ఆదేశాలు జారీ చేశారు. సేంద్రియ వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని ప్రతినిధులు కోరారు.

News December 5, 2025
‘పకడ్బందీగా పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి’

ఖమ్మం: మొదటి విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు కొరకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేసామని సాధారణ ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామరావు అన్నారు. శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. మొదటి విడతకు మొత్తం 1582 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.