News May 3, 2024
ఖమ్మం: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు ఏపీ గ్రామాల విలీనం

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఎటపాక , గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం , పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.
Similar News
News March 17, 2026
ఈ నెల 22న ఖమ్మం బంద్‌కు పిలుపు

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల ఇళ్లను కూల్చివేసిన చోటే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22న ‘ఖమ్మం బంద్’కు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పిలుపునిచ్చింది. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు అన్నారు. వ్యాపార వర్గాలు, ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని నిరుపేదలకు అండగా నిలవాలని కోరారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.
News March 17, 2026
ఖమ్మం రైల్వే పనుల్లో జాప్యం

ఖమ్మం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో జాప్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ‘అమృత్ భారత్’ పథకం కింద రూ. 25.41 కోట్లతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రెండో నంబర్ ప్లాట్‌ఫాంపై కనీస సౌకర్యాలు లేక, మూడో లైను ప్లాట్‌ఫాం నిర్మాణం పూర్తికాక రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 2026 గడువులోగా పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News March 17, 2026
ఖమ్మం: ALERT.. రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

జిల్లాలోని SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు మీసేవలో లేదా tgobmms.cgg.gov.in పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు 60-90% వరకు సబ్సిడీ లభిస్తుందన్నారు. ప్రధానంగా 2 వీలర్, 3 వీలర్ వాహనాలు, సోలార్ పంప్‌సెట్ల వంటి పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
# SHARE IT


