News March 6, 2025
ఖమ్మం: కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్ మింగేశాడు. మోతీలాల్- శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
Similar News
News December 7, 2025
గాలివీడు: 42 ఏళ్ల తర్వాత కలిశారు.!

గాలివీడు మండల జడ్పీ హైస్కూల్ 1982–83 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఆదివారం SK కళ్యాణ మండపంలో నిర్వహించారు. పాత మిత్రులు ఒకచోట చేరి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలతో బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి కలయిక ఎంతో ఆనందంగా ఉందని పలువురు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. దాదాపు 42 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో పాఠశాల జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
News December 7, 2025
ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్

భారీగా విమాన సర్వీసుల రద్దు, వాయిదాలతో ప్రయాణికుల ఖాతాల్లోకి ఇండిగో డబ్బులు రీఫండ్ చేస్తోంది. ఇప్పటివరకు రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ తెలిపింది. మరోవైపు 95శాతం సర్వీసులను రీస్టోర్ చేసినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10-15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుతాయని పేర్కొంది.
News December 7, 2025
బ్రహ్మసముద్రం: అన్నదమ్ముల మృతిపై అప్‌డేట్..!

బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురంలోని నీటి సంపులో పడి అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కళ్యాణదుర్గానికి చెందిన అన్నదమ్ములు నరేంద్ర (32), చరణ్ (25)పాల వెంకటాపురంలోని మామిడి తోటలోని సంపు వద్దకు వెళ్లారు. చరణ్ కాలుజారి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న సంపులో దూకాడు. ఇద్దరికి ఈతరాకపోవడంతో ఊపిరాడిక మృతి చెందారు.


