News March 6, 2025

ఖమ్మం: కాయిన్ మింగిన నాలుగేళ్ల చిన్నారి

image

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాండురంగాపురంలో నాలుగేళ్ల చిన్నారి ఆడుకుంటూ కాయిన్‌ మింగేశాడు. మోతీలాల్- శైలజ కుమారుడు ప్రద్యుత్ ఐదు రూపాయల కాయిన్‌తో ఆడుకుంటూ.. నోట్లో పెట్టుకుని మింగడంతో అది గొంతులో ఇరుక్కుపోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన డాక్టర్లు గొంతులోని కాయిన్‌ను ఎండోస్కోపీ ద్వారా ఆపరేషన్ లేకుండా బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.

Similar News

News March 24, 2025

SLBC ఘటనపై నేడు సీఎం రేవంత్ సమీక్ష

image

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పరిధి నాగర్ కర్నూల్ జిల్లా SLBC సొరంగం కూలిన ఘటనలో గల్లంతైన కార్మికులను వెలికితీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం శాసనసభ కమిటీ హాల్లో సహాయక చర్యలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న 12 ఏజెన్సీల ఉన్నతాధికారులను ప్రభుత్వం ఈ సమావేశానికి పిలించింది. కాగా గల్లంతైన 8 మంది కార్మికుల్లో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు.

News March 24, 2025

ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

image

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.

News March 24, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పొలిటికల్ వార్

image

సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్, BRS పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కాయి. గజ్వేల్ మాజీ MLA నర్సారెడ్డి రాజ్‌భవన్‌కు పాదయాత చేపట్టగా.. BRS మాజీ MLA ‘ఎండిన గోదావరి తల్లి కన్నీటి గోస’తో చేపట్టిన పాదయాత్ర ముగిసింది. గజ్వేల్ MLA క్యాంపు ఆఫీస్‌కు బీజేపీ నేతలు TOLET బోర్డు పెట్టడంతో కాంగ్రెస్, బీజేపీ కావాలనే కుట్రలో భాగంగా కేసీఆర్‌ను భద్నం చేయాలని చూస్తున్నాయని BRS శ్రేణులు మండిపడుతున్నారు. మరి మీ కామెంట్..

error: Content is protected !!