News January 11, 2026

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్‌ఎస్‌ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

ఏలూరు జిల్లాలో ఇంటర్ పరీక్షకు 17,122 మంది హాజరు

image

ఏలూరు జిల్లాలో శుక్రవారం ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ పరీక్షకు మొత్తం 17,122 మంది హాజరు కాగా 451 మంది గైర్హాజరు అయ్యారని RIO యోహాన్ తెలిపారు. ఈ పరీక్షల్లో జనరల్ విద్యార్థులు 15,250 మందికి 14,893 హాజరు కాగా 357 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. అలాగే ఒకేషనల్ విద్యార్థులు 2,323 మందికి 2,229, హాజరుకాగా 94 మంది గైర్హాజరు అయ్యారని దీంతో 97 శాతం పరీక్ష హాజరు నమోదైందన్నారు.

News January 23, 2026

సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.

News January 23, 2026

పూర్తిగా సహకరించా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించానని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రెండేళ్ల విచారణలో లీకులు ఎందుకు ఇస్తున్నారని సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించా. పార్టీ నేతలపై వ్యక్తిత్వ హననానికి ఎవరు బాధ్యులని అడిగా’ అని తెలిపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ఈ డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు.