News June 24, 2024
ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్గా అభిషేక్ అగస్త్య

ఖమ్మం కార్పొరేషన్ నూతన కమిషనర్ గా అభిషేక్ అగస్త్య(IAS)ను నియమిస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 సివిల్స్ బ్యాచ్కు చెందిన అభిషేక్ అగస్త్య 38 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. అభిషేక్ అగస్త్య స్వస్థలం జమ్మూకశ్మీర్. ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ గా రానున్నారు.
Similar News
News December 12, 2025
H.I.V వ్యాక్సిన్ పట్ల సంపూర్ణ అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్

ఖమ్మం: హెచ్.పి.వి. వ్యాక్సిన్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఖమ్మం జడ్పి కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హెచ్.పి.వి. వ్యాక్సినేషన్ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 14 సంవత్సరాల వయస్సు గల బాలికల్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి బాలికలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరం వుందని పేర్కొన్నారు.
News December 11, 2025
OFFICIAL: మొదటి విడత పోలింగ్ 90.08 శాతం నమోదు

మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఖమ్మం జిల్లాలో 90.08 శాతం నమోదైందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనకల్ మండలంలో 90.85 శాతం, చింతకాని మండలంలో 91.05 శాతం, కొణిజెర్ల మండలంలో 89.61 శాతం, మధిర మండలంలో 90.08 శాతం, రఘునాథపాలెం మండలంలో 91.09 శాతం, వైరా మండలంలో 90.67 శాతం, ఎర్రుపాలెం మండలంలో 87.28 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 11, 2025
6 వేల మందికి పైగా బైండోవర్ చేశాం: ఖమ్మం సీపీ

జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మందిని ఉండకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే 6 వేల మందికి పైగా బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు.


