News April 2, 2025

ఖమ్మం: కేంద్రమంత్రితో రాజ్యసభ ఎంపీలు భేటీ

image

రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్‌లో ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

Similar News

News October 14, 2025

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలి: కలెక్టర్

image

ఇందిరా మహిళా డెయిరీ సమగ్ర రిపోర్టు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఇందిరా డెయిరీ, జాతీయ రహదారులు, ఉద్యోగుల అటెండెన్స్ వంటి అంశాలపై సమీక్షించారు. మధిర, ఎర్రుపాలెం మండలాల్లో చాలా తక్కువగా యావరేజ్ పాల ఉత్పత్తి జరుగుతుందని, దీనికి గల కారణాలను క్షేత్ర స్థాయిలో రివ్యూ చేయాలని అదనపు కలెక్టర్‌కు సూచించారు.

News October 14, 2025

తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

image

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News October 13, 2025

‘యంగ్ ఇండియా గురుకులాలను వేగవంతంగా నిర్మించాలి’

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల విద్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం యంగ్ ఇండియా గురుకులాల నిర్మాణం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం సంబంధించి బిల్లులు 24 గంటల లోపు క్లియర్ చేయాలని, పనులు ఎక్కడా ఆలస్యం కావడానికి వీలు లేదన్నారు.