News August 31, 2024
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలకు PINK ALERT⚠️

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Similar News
News December 9, 2025
ఖమ్మం: ఎన్నికల వేళ ఇలా చేస్తున్నారా.. జైలుకే..!

ఖమ్మం జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ, పల్లెల్లో డబ్బు, మద్యం పంపిణీ వంటి ప్రలోభాలు జోరందుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే ఎన్నికల్లో ఇటువంటి చర్యలు నేరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023 ప్రకారం, ఎన్నికల వేళ ప్రలోభాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా నిరూపణ అయితే, తీవ్రమైన శిక్షలతో పాటు జరిమానా తప్పదని స్పష్టం చేశారు.
News December 9, 2025
ఖమ్మం: గ్రానైట్ పరిశ్రమల సమస్యలు పరిశీలించిన కలెక్టర్

ఖమ్మం ఇండస్ట్రియల్ కాలనీలోని గ్రానైట్ యూనిట్లను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించి పరిశ్రమల పరిస్థితులను పరిశీలించారు. యాజమాన్యం, కార్మికులతో మాట్లాడుతూ.. విద్యుత్ ఛార్జీలు, ఎగుమతులు, మార్కెట్ డిమాండ్ వంటి సమస్యలను తెలుసుకున్నారు. గ్రానైట్ రంగం వేల కుటుంబాలకు ఆధారం కావడంతో త్వరలో పరిశ్రమలతో సమావేశం నిర్వహించి పరిష్కార చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.