News March 29, 2024
ఖమ్మం: కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
కొబ్బరి చెట్టుపై నుంచి ఓ యువకుడి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన వేంసూరు మండలం అమ్మపాలెంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (34)కొబ్బరికాయలు కోసేందుకు చెట్టు ఎక్కాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 24, 2025
చాపరాలపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
ములకలపల్లి మండలం చాపరాలపల్లి గుట్టగూడెం సమీపంలో పేకాట ఆడుతున్న కొంత మంది వ్యక్తులపై పోలీసులు శుక్రవారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులతో పాటు రూ.6000 నగదు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో SI కిన్నెర రాజశేఖర్‌తో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
News January 24, 2025
బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి: ఖమ్మం కలెక్టర్
బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.
News January 24, 2025
అద్దె ఇంట్లో ఉన్నవారు అనర్హులని అనడం దారుణం: బీజేపీ
జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.