News February 10, 2025
ఖమ్మం: కోడలిపై మామ లైంగిక వేధింపులు..?

అత్తింటివారు వేధిస్తున్నారని మంథని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఓ యువతి నిరసన చేసింది. వివరాలు.. ఖమ్మం (D)కు చెందిన యువతికి పోచమ్మవాడకు చెందిన వ్యక్తితో పెళ్లైంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాగా మామ లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది. గత నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేసి పుట్టింటికి వెళ్లింది. భర్త మరో పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పడంతో ఆదివారం నిరసన చేపట్టింది. కేసు నమోదు చేసినట్లు SI రమేశ్ తెలిపారు.
Similar News
News January 9, 2026
ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో యాసంగి సాగు అవసరాలకు తగినంత యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 10,942 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని, ఇప్పటి వరకు రైతులకు 36,314 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
News January 9, 2026
ప్రమాదాల నివారణ అందరి బాధ్యత: అదనపు కలెక్టర్

రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పెట్రోల్ బంక్ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బంకుల వద్ద భద్రత కోసం ఇరువైపులా 100 మీటర్ల మేర బ్లింకర్స్, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రాకపోకల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఉండాలన్నారు.
News January 9, 2026
ఎల్బీనగర్ – ఖమ్మం మధ్య ప్రత్యేక బస్సులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎల్బీనగర్ నుంచి ఖమ్మంకు నేడు, రేపు ప్రత్యేక నాన్-స్టాప్ డీలక్స్ సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఉదయం 9 నుంచి రాత్రి 10:30 గంటల వరకు మొత్తం 8 బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సీట్లు పరిమితంగా ఉన్నందున ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.


