News March 6, 2025
ఖమ్మం కోర్టులో రూ.24 లక్షలకు ఐపీ దాఖలు

ఖమ్మం పట్టణానికి చెందిన లత అనే మహిళ రూ.24,10,000 లకు ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశారు. ప్రైవేట్ హోటల్ వ్యాపారం చేస్తుండగా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు అప్పులు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో, రుణదాతల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో 12 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ తమ న్యాయవాది ద్వారా బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Similar News
News April 23, 2025
భానుడి ఉగ్రరూపం.. ఆ మండలాల్లోనే అత్యధికం

ఖమ్మం జిల్లాలో వాతావరణం నిప్పులకొలిమిని తలపిస్తుంది. మంగళవారం జిల్లాలోనే ఎర్రుపాలెంలో అత్యధికంగా 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ముదిగొండ (బాణాపురం), నేలకొండపల్లిలో 42.8, కామేపల్లి (లింగాల), కారేపల్లి 42.7, వైరా 42.5, ఖమ్మం అర్బన్ 42.4, వేంసూరు, మధిర 42.3, తిరుమలాయపాలెం(బచ్చోడు) 42.1, రఘునాథపాలెం 41.5, బోనకల్, చింతకాని 41.4, కల్లూరు 39.8, సత్తుపల్లి 39.3 నమోదైంది.
News April 23, 2025
నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్, ఏలువారిగూడెంలో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం ఖమ్మం నగరం, కల్లూరు మండలంలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
News April 23, 2025
27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు: ఖమ్మం DEO

తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 27న (ఆదివారం) నాడు నిర్వహిస్తున్నట్లు DEO సోమశేఖర్ వర్మ తెలిపారు. 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10వ తరగతి విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించబడతాయని చెప్పారు. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా పత్రాల లీకేజీ వదంతులు నమ్మవద్దని సూచించారు.