News January 19, 2025

ఖమ్మం ఖిల్లా వెయ్యేళ్ల చరిత్ర ఇదే..!

image

ఖమ్మం ఖిల్లాకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. క్రీ.శ 997లో గజపతులతో పాటు ఖమ్మం వచ్చిన కొండాపురానికి చెందిన అక్కిరెడ్డి, అస్కారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించగా.. క్రీ.శ. 1006లో నిర్మాణం పూర్తయింది. 1531లో సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌‌ను ఓడించి కోటను స్వాధీనపరుచుకున్నాడు. అప్పటి నుంచి ఈ ఖిల్లా కుతుబ్ షాహీల పాలనలోకి వెళ్లింది. 17వ శతాబ్దంలో ఆసఫ్ జాహీల ఆధీనంలోకి పోయింది.

Similar News

News February 8, 2025

భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 8, 2025

క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి:DIEO 

image

ఇంటర్‌లో MPHW (ఫీమేల్) కోర్సు ఉత్తీర్ణులైన వారు ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని DIEO రవిబాబు సూచించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇచ్చే శిక్షణకు ఎంపికైన వారు రూ.వెయ్యి డీడీ అందజేయాల్సి ఉంటుందని, గతంలో దరఖాస్తు చేసుకుని ఎంపిక కాని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు బయోడేటాతో దరఖాస్తులను కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 15లోగా అందజేయాలన్నారు.

News February 8, 2025

ఖమ్మం: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

ఖమ్మం జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన మూడు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇందులో ఇద్దరు వరుసకు సోదరులు. ఇటీవల కన్నుమూసిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా బూడిదంపాడు వద్ద ప్రమాదం జరిగింది. ఇంకో ఘటన బోనకల్‌లో శుభకార్యానికి వెళ్లొస్తుండగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఖమ్మం టేకులపల్లి బ్రిడ్జి సమీపంలో జరిగిన మరో ప్రమాదంలో ఆస్పత్రికి వచ్చివెళ్తున్న రైతు కన్నుమూశాడు.

error: Content is protected !!