News October 1, 2024
ఖమ్మం: ‘గంజాయి అమ్మిన కొన్నా కఠిన చర్యలు’
ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 2.80కోట్ల గంజాయిని ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. జిల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 9, 2024
అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. ”మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.
News October 9, 2024
KMM: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నర్సిరెడ్డి
ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం TSUTF ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్ నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.
News October 9, 2024
రేపు దద్దరిల్లనున్న ఖమ్మం
సద్దుల బతుకమ్మ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ముస్తాబైంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మైదానాలు బతుకమ్మ వేడుకలకు రెడీ అయ్యాయి. వేలాది మంది ఆడపడుచులు అందంగా బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను చేసి జిల్లా కేంద్రాలతో ప్రధాన పట్టణాలలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సెంటర్లకు తీసుకొస్తారు. మైదానాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.