News November 16, 2024
ఖమ్మం: గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సువర్ణ పురం గ్రామానికి చెందిన వేల్పుల భార్గవి(16) మండల కేంద్రంలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతుంది. కాగా శుక్రవారం రాత్రి భార్గవి గడ్డి మందు తాగడంతో తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, శనివారం మృతి చెందింది. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 17, 2025
ఖమ్మం జిల్లాలో 1,164 మద్యం టెండర్ల దరఖాస్తులు

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం టెండర్ల కోసం గురువారం నాటికి 1,164 వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా 672 దరఖాస్తులు రాగా గురువారం ఒక్క రోజే 492 దరఖాస్తులు అందాయి. ఖమ్మం ఎక్సైజ్ 1 స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాలకు 395 దరఖాస్తులు రాగా, ఖమ్మం-2 ఎక్సైజ్ స్టేషన్కు 215, నేలకొండపల్లి-90, వైరా-81, మధిర-98, సత్తుపల్లి- 247, సింగరేణి-40 దరఖాస్తులు నమోదయ్యాయి.
News October 17, 2025
ఆ ఆసుపత్రుల్లో ఆశించిన పురోగతి లేదు: ఖమ్మం కలెక్టర్

మెరుగైన సేవలతో ప్రభుత్వ వైద్యం పట్ల నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల పనితీరుపై సమీక్షించారు. వైద్య విధానం పరిషత్ ఆసుపత్రులలో ప్రసవాలు జులైలో 47 నుంచి సెప్టెంబర్ 74కు చేరాయని, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి ఆసుపత్రిలో మంచి ఫలితాలు రాగా, కల్లూరు, వైరా, సత్తుపల్లి , పెనుబల్లి, మధిర ఆసుపత్రులలో ఆశించిన పురోగతి లేదన్నారు.
News October 17, 2025
పత్తి విక్రయాల్లో స్లాట్ బుకింగ్ విధానం: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం: పత్తి రైతులు ఇకపై స్లాట్ బుకింగ్ పద్ధతిలో పంటను విక్రయించుకోవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, సమీప జిన్నింగ్ మిల్లులో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 8–12% తేమ ఉన్న పత్తికి రూ.8110–7786 మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు. స్లాట్ రద్దును 24 గంటల ముందుగానే చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.