News November 16, 2024

ఖమ్మం: గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

image

గడ్డి మందు తాగి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ముదిగొండ మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. సువర్ణ పురం గ్రామానికి చెందిన వేల్పుల భార్గవి(16) మండల కేంద్రంలోని హైస్కూల్లో పదో తరగతి చదువుతుంది. కాగా శుక్రవారం రాత్రి భార్గవి గడ్డి మందు తాగడంతో తల్లిదండ్రులు ఆమెను ఖమ్మం ఆసుపత్రికి తరలించగా, శనివారం మృతి చెందింది. భార్గవి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 11, 2026

KMM: నీరా కేఫ్‌ లీజుకు దరఖాస్తుల ఆహ్వానం

image

హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులోని ‘నీరా కేఫ్‌’ భవనాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. కల్లు గీత కార్మిక సహకార సంఘాల్లో నమోదై, నీరా సేకరణ అనుమతి ఉన్నవారు ఈనెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గలవారు వివరాల కోసం www.tgttcfc.com వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు. గౌడ వృత్తిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 11, 2026

గత ‘ఇందిరమ్మ’ బిల్లుల గోల్‌మాల్‌.. విచారణకు ఆదేశం

image

వైఎస్ఆర్ హయాంలో కొందరు నేతలు తమకు తెలియకుండానే తమ పేర్లపై ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు డ్రా చేశారని వేంసూరు బాధితులు గ్రీవెన్స్‌లో మొరపెట్టుకున్నారు. ఈ పాత రికార్డుల వల్ల ఇప్పుడు కొత్త ఇళ్లకు తాము అనర్హులమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి కేసులు వేలల్లో ఉండటంతో అధికారులు విచారణ చేపట్టారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాస్ నాయక్ హామీ ఇచ్చారు.

News March 11, 2026

ఖమ్మంలో రేపు జాబ్ మేళా

image

నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాల కోసం మార్చి 12న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, మెకానికల్ డిప్లొమా, బీటెక్ మెకానికల్ అర్హత కలిగిన 22-33 ఏళ్ల యువత సర్టిఫికెట్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.