News September 5, 2024
ఖమ్మం: గత నెలలో డయల్-100కు 4,119 కాల్స్
సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు గత నెలలో 4,119 కాల్స్ వచ్చినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిపై 91 FIR నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-3, దొంగతనాలు-15, సాధారణ ఘాతాలు-33, అనుమానస్పద మరణాలు-4, ఇతర కేసులు-25 అన్నారు. డయల్-100కు ఫేక్ కాల్స్ చేయొద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
సాగర్ ఎడమ కాలువ గండ్లను పూడ్చాలి: మంత్రి తుమ్మల
సాగర్ ఎడమ కాలువ గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. తుపాను ప్రభావంతో వరదల వల్ల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండ్లు పడ్డాయని, కాలువ మరమ్మతు పనులు త్వరగా చేపట్టాలని తుమ్మల కోరారు. చివరి ఆయకట్టు రైతులకు నీరందించడామే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను వేగవంతం చేయాలని తుమ్మల అన్నారు.
News September 19, 2024
వరద బాధితులకు నెల జీతం చెక్ అందించిన కూనంనేని
ఖమ్మం వరద బాధితులకు సహాయార్థం తన నెల జీతాన్ని అందజేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి నెల జీతం చెక్కును అందజేశారు. సీఎం సహాయనిధి ద్వారా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు.
News September 19, 2024
భద్రాద్రి జిల్లాలో తహశీల్దార్‌ల బదిలీలు
భద్రాద్రి జిల్లాలో పలు మండలాల తహసీల్దారులను బదిలీ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. టేకులపల్లి MRO నాగభవాని అశ్వాపురానికి, దమ్మపేట MRO నరేష్ పినపాకకు, బూర్గంపాడు MRO ముజాహిద్ టేకులపల్లికి, పినపాక MRO శ్రీనివాసరావు గుండాలకు, చుంచుపల్లి MRO కృష్ణ దమ్మపేటకు, గుండాల MRO ఇమ్మానుయేల్ బూర్గంపాడుకు, అశ్వాపురం MRO స్వర్ణ చుంచుపల్లికి బదిలీ అయ్యారు.