News November 6, 2024

ఖమ్మం: గత నెలలో డయల్-100 కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే?

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100 కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో 4,481 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. వీటిపై 74 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-4, సాధారణ ఘటనలు-24, యాక్సిడెంట్లు-12, అనుమానస్పద మరణాలు-10, ఇతర కేసులు- 23 అన్నారు. డయల్-100 కు అత్యవసర సమయాల్లో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.

Similar News

News November 28, 2025

ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

News November 28, 2025

ఖమ్మం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం!

image

ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉంది. తాజా ఓటర్ల వివరాల ప్రకారం నేలకొండపల్లిలో అత్యధికంగా 2,150 మంది మహిళా ఓటర్లు అదనంగా ఉన్నారు. రఘునాథపాలెం 1,946, కూసుమంచి 1,645, చింతకాని 1,733, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, ఏరుపాలెం, తల్లాడ, బోనకల్, పెనుబల్లి, కొణిజర్ల, సింగరేణి వంటి మొత్తం 12 మండలాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే 1,000కి పైగా అధికంగా ఉన్నారు.

News November 28, 2025

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు కలెక్టర్ శ్రీజ పర్యటన

image

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఆమె ఆసుపత్రిలో జరుగుతున్న సదరం భవన నిర్మాణ పురోగతిని, అలాగే వివిధ సివిల్ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిని మరింత మెరుగైన సౌకర్యాలతో తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ సూచించారు.