News November 6, 2024
ఖమ్మం: గత నెలలో డయల్-100 కు ఎన్ని కాల్స్ వచ్చాయంటే?
సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100 కు పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత నెలలో 4,481 కాల్స్ వచ్చాయని సీపీ సునీల్ దత్ తెలిపారు. వీటిపై 74 ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-1, దొంగతనాలు-4, సాధారణ ఘటనలు-24, యాక్సిడెంట్లు-12, అనుమానస్పద మరణాలు-10, ఇతర కేసులు- 23 అన్నారు. డయల్-100 కు అత్యవసర సమయాల్లో మాత్రమే ఫోన్ చేయాలన్నారు.
Similar News
News December 9, 2024
REWIND: మహాలక్ష్మి పథకంకి ఏడాది పూర్తి
మహాలక్ష్మి పథకం అమలై ఏడాది అవుతోంది. గతేడాది ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం పాతబస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు.
News December 9, 2024
గుడ్ల ధరలు పెరుగుతున్నాయ్
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండగా, తాజాగా కోడిగుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్‌లో ఒకో గుడ్డు రూ.5.90 ఉండగా, రిటైల్‌గా రూ.7 వరకు పలుకుతోంది. ప్రస్తుతం డజను గుడ్డుల ధర బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.84 వరకు ఉండడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు కొనలేని పరిస్థితి ఏర్పడింది.
News December 9, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} అన్నపు రెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం ∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} పినపాకలో బీఆర్ఎస్ కార్యక్రమం ∆} ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు