News January 29, 2025
ఖమ్మం: గుండెపోటుతో విద్యార్థిని మృతి

గుండెపోటుతో విద్యార్థిని మృతిచెందిన ఘటన రఘునాథపాలెం మండలం రేగులచలకలో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఈ నెల 26న శ్రావణి స్కూల్‌లోనే అస్వస్థతకు గురైంది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం కన్నుమూసింది. శ్రావణి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
Similar News
News February 13, 2025
మున్సిపాలిటీలకు టెన్షన్‌గా పన్ను వసూళ్లు

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.
News February 13, 2025
కూసుమంచి: కల్లులో పురుగు మందు కలిపాడు..!

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.
News February 13, 2025
ఖమ్మం జిల్లాలో రెచ్చిపోతున్న దొంగలు

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరి జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చోరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.