News March 15, 2025
ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

నిత్యం వార్తా పత్రికలు చేరవేస్తున్న వ్యక్తి.. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరణించడంతో వార్తలో నిలిచిన ఘటన చింతకాని మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన రాజుల అనిల్ అనే వ్యక్తి డైలీ న్యూస్ పేపర్స్‌ను ఆటోలో చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News January 7, 2026
మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో కానున్న నాగార్జున!

రా కార్తీక్ డైరెక్షన్లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
News January 7, 2026
పదో తరగతి పరీక్షలకు 72 కేంద్రాలు: డీఈవో

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 72 కేంద్రాల్లో 11,985 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నట్లు డీఈవో డా.కె.రామకృష్ణారావు తెలిపారు. అడ్డతీగల, రాజవొమ్మంగి పాఠశాలలను మంగళవారం తనిఖీ చేసిన ఆయన, వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.
News January 7, 2026
మిల్లర్లు సహకరించాలి: నెల్లూరు జేసీ

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించేలా మిల్లర్లు సహకరించాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని మిల్లర్స్ అసోసియేషన్, మిల్లర్స్‌తో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లేట్ ఖరీఫ్, ఎర్లీ రబీకి సంబంధించి ధాన్యం సేకరణ, బ్యాంకు గ్యారంటీలపై చర్చించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.


