News January 24, 2025
ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్

ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.
Similar News
News October 21, 2025
ఖమ్మంలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

శాంతి సమాజ స్థాపన కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగింది. అమరవీరుల స్మారక స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, అమరుల కుటుంబ సభ్యులు పాల్గొని వీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
News October 20, 2025
ఖమ్మం: విద్యార్థి మృతి.. ఆర్ఎంపీ ఇంటి ముందు ఆందోళన

చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి జస్వంత్ ఆర్ఎంపీ వైద్యం వికటించి మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు ఆరోపించారు. కొదుమూరులోని ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకున్న కొద్దిసేపటికే తమ బిడ్డ మృతి చెందాడన్నారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతని ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
News October 19, 2025
ఖమ్మం జిల్లాలో 4,043 దరఖాస్తులు

ఖమ్మం జిల్లాలో 116 వైన్స్లకు 4,043 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 1,653 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున 121.29 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 122 వైన్స్లకు 7200 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 144 కోట్ల ఆదాయం లభిచింది. ఈ నెల 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది.