News January 21, 2025

ఖమ్మం: గ్రామసభ ఏర్పాట్లు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

image

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమైన నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని గ్రామాల్లో శాంతిభద్రతలకు సమస్య తలెత్తకుండా ఏర్పాటుచేసిన బందోబస్తును సీపీ సునీల్ దత్ పర్యవేక్షించారు. ఖమ్మం మంచుకొండ, మధిర నాగులవంచ, పాలేరు మద్దులపల్లి గ్రామ సభలను సందర్శించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా వుండాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.

Similar News

News February 12, 2025

భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

image

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.

News February 12, 2025

KMM: 10th అర్హతతో 51 GOVT జాబ్స్

image

ఖమ్మం డివిజన్‌‌లో 48 GDS, 3 డాక్ సేవక్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. SHARE IT

News February 12, 2025

వైరా: నిలిచిపోయిన బీర్ల సరఫరా!

image

వైరాలోని IMFL డిపో నుంచి మంగళవారం బీర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.150గా ఉన్న లైట్ బీర్ బాటిల్ ధర రూ.180కి, స్ట్రాంగ్ బీర్ బాటిల్ ధర రూ.40 మేర పెంచుతూ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే నిన్న మధ్యాహ్నం వరకు స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బార్లు, వైన్స్‌ల నిర్వాహకులు బీర్ల స్టాక్ తీసుకెళ్లలేదు. బుధవారం స్టాక్ తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!