News October 1, 2024
ఖమ్మం గ్రీవెన్స్‌కు భారీగా వినతులు
ఖమ్మం గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై ప్రజలు వినతులు అందించేందుకు భారీగా తరలివచ్చారు. కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే వచ్చాయని వాటిని క్షేత్రస్థాయిలో వెళ్లి విచారించి న్యాయం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
Similar News
News October 11, 2024
KMM: ‘ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలి’
రాష్ట్ర వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయ పెంపు మార్గాలపై దృష్టిని సారించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదాయం సమకూర్చే శాఖల లక్ష్యాలపై సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. వార్షిక లక్ష్యాలను చేరుకోవడంలో శాఖల పనితీరును మెరుగు పరుచుకోవాలని చెప్పారు. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉన్నారు.
News October 10, 2024
ఖమ్మం: బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి
కూసుమంచి మండలం పెరిక సింగారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి కోలాటం ఆడుతూ బతుకమ్మ వేడుకల్లో సందడి చేశారు. మంత్రి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని, 9 రోజులు తీరొక్క పూలతో గౌరమ్మను ఘనంగా పూజించి, సమైక్య స్పూర్తిని చాటే సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
News October 10, 2024
దసరాకు వంతెనపై రాకపోకలు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
దసరా పండుగ లోపు ప్రకాశ్ నగర్ బ్రిడ్జి దగ్గర పాత లోలెవల్ కాజ్ వే డైవర్షన్ రోడ్డు పనులు పూర్తి చేసి, రాకపోకలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మంలోని 28వ డివిజన్ ప్రకాశ్ నగర్‌లో పర్యటించి టీ.యూ.ఎఫ్.ఐ.డి.సి. నిధులు రూ.కోటి 90 లక్షలతో చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు.